Tuesday, 28 September 2021

Life

వెలుగును చూసిన వెంటనే ఏడుపు

చీకటిలో ఉందామంటే భయం

ఏం కావాలో తెలియదు ఈ మేనుకు..


అందని దానికోసం ప్రయాస

ప్రయాస పడకుండా పెంచుకునే ఆశ

ఎంత దూరం నడపాలో తెలియదు ఈ ఆలోచనకు..


సంపద కోసమే సంపాదించే జ్ఞానం

జ్ఞానం మాత్రమే సంపదైతే నడవదుగా కాలం

ఏది ముఖ్యమైనదో తెలియదు ఈ మనసుకు...


మీ ముగ్గురి ఐక్యత లేకపొతే ఏమగునో ఈ ప్రయాణం

ఎంతవరకో తెలియదు కానీ ఈ భవసాగర మథనం

చివరకు అమృతం(Success) దొరుకుతుందనే ఓ చిన్న నమ్మకం.


No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...