Monday, 18 November 2019

నీకోసం ఎదురుచూపులు - Waiting For You

నీకోసం ఎదురుచూపులు

   ప్రాణంలో ప్రాణమై,నాలోని భావమై,
   మధురమైన గానమై,మురిపించే నృత్యమై
   నా గుండెలోని చప్పుడై, గుండెలోని తలుపువై
   స్పర్శించే గాలివై,స్పర్శనిచ్చే జీవమై
   నాలోని గెలుపువై,గెలుపునిచ్చే మలుపువై
   ముందు నడిచే మార్గదర్శివై,వెనుక వచ్చే నీడవై
   నా దారిలోని వెలుగువై,దారి చూపే దిక్సూచివై
   నా గొంతులో స్వరమువై,నా అడుగులో అడుగువై
   చలన చిత్రంలో తారవై,నింగిలోని నక్షత్రమై
   నరనరాల్లో వీనవై,నాలోని సత్తువై
   దివినుండి వచ్చిన దేవతవై,నిత్యం వెలిగే దివ్వెవై
   మంచులోని తెలుపువై, తారలోని తళుకువై
   కుసుమంలోని మకరందమై,నా పెదవిపై చిరునవ్వువై
   మల్లెలోని సువాసనై,జాజిలోని దారమై
   కనుపైన కనుబొమ్మవై ,నా ఆలోచనలో ఆలోచనై........

   కలలోని స్వప్నమై మెరిసి మాయమయ్యావు !
   ప్రొద్దుతిరుగుడు పువ్వు రవికోసం ఎదురుచూసినట్టు..,
  నీరాక కోసం నేను ఎదురుచూస్తున్నాను ప్రియతమా!

No comments:

Post a Comment

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది

ఏదో సంథింగ్ మ్యాజిక్ ఉంది  ఏదో చెప్పలేని భావన ఉంది  నీ పేరు తలచుకుంటే కళ్ళనుండి జారే ముత్యమో లేక నన్నే మరిచి చిన్న పిల్లాడిని అయ్యానో మారం చ...